సంప్రదాయం, సాహిత్యం యిలా ఎందులోనైన తెలుగుదనానిది ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ తెలుగుదనాన్ని నమస్కరిస్తూ మేము చేసిన ప్రయత్నమే సంపుటి. ఇలాంటి మహత్తరమైన సాహిత్యమును సృష్టించి పునాది వేసిన మహానీయులు ఎందరో. పునాదిగా నిలిచిన మహానుభావులు మరెందరో.
నిన్నటి గొప్పదనాన్ని నేడు కూడా గొడుగు పట్టాలి. ఎంతటి గొప్ప సాహిత్యమైన దానిని ముందుకు నడిపే నవభావకులు లేనిదే మరుగున పడిపోతుంది. నేటి తరంవారు ఈ సాహిత్యానికి తమ వంతు "కలాన్ని " ధారపోయ్యాలి.
అట్టి వారికి సంపుటి ఆహ్వానాన్ని అందిస్తోంది. మీకు కధలు రచనలు చేసే ఉత్సాహం ఉన్నా అనుభవం ఉన్నా, అవి సంపుటిలో ప్రచురించే అవకాశాన్ని వినియోగించుకోవాలని ఉన్నా, మాకు తెలియజేయండి.